దూకుడు స్టొరీ ..తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే కొడుకు గా మహేష్

స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమా దూకుడు రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ కోసం, హైదరాబాదు ప్రజల కోసం పి. జనార్దన్ రెడ్డి నిరంతరం పోరాటం చేశారు. నిరాడంబరమైన జీవితంతో హైదరాబాదులోని అట్టడుగు ప్రజలకు పి. జనార్దన్ రెడ్డి ఆత్మీయుడిగా మెలిగారు. వైయస్ హయాంలోనే అకస్మాత్తుగా ఆయన మరణించారు. ఆయన అంతిమ యాత్రకు పెద్ద యెత్తున కదిలి వచ్చారు. తమ ఆత్మీయుడు పోయినట్లుగా ప్రజలు గుండెలు బాదుకుని విలపించారు.

పి. జనార్దన్ రెడ్డిగా ప్రకాష్ రాజ్ నటించినట్లు సమాచారం. ఆయన కుమారుడిగా మహేష్ బాబు ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. పి. జనార్దన్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డికి అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారని అంటారు. అయితే, పి. జనార్దన్ రెడ్డిపై ఉన్న ప్రజాదరణకు తట్టుకోలేకనే ఆయనకు టికెట్ ఇచ్చినట్లు చెబుతారు. అయితే, ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిని కథానాయకుడిగా ఎలా దూకుడు సినిమాలో చూపించారనేది తెలియదు. అయితే, జనార్దన్ రెడ్డి పాత్ర ఆధారంగా రూపొందిన నిజాయితీ గల శాసనసభ్యుడి కుమారుడిని శాసనసభ్యుడిగానో రాజకీయ నాయకుడిగానో కాకుండా పోలీసాఫీసరుగా సినిమాలో చూపించినట్లు చెబుతున్నారు. పేద ప్రజల భూమిని కాంగ్రెసు పార్టీ కార్యాలయం కోసం తీసుకోవడంపై పి. జనార్దన్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పోరాటం సినిమాలో ప్రధానం ఉండవచ్చు. అందుకే, తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి సినిమాలో మహేష్ బాబు తెలంగాణ భాషలో డైలాగులు చెప్తారని అంటున్నారు.
Tags: , , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.