Mahesh babu,venkatesh multistarer moview story

మహేష్ బాబు, వెంకటేష్ లతో మల్టీస్టారర్‌ గా తీయనున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నిన్న(గురువారం)దసరా రోజున దిల్‌రాజు కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. కొత్త బంగారులోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.ఇక ఈ చిత్రం కాన్సెప్టు విషయానికి వస్తే సీతమ్మ వాకిలి అంటే భారత దేశం. సిరిమల్లె చెట్టు అంటే కుటుంబం. మంచి కుటుంబం ఉంటే మంచి సమాజం తయారవుతుంది. మంచి సమాజం ద్వారా మంచిదేశం రూపొందుతుంది. ఈలాంటి లైన్‌తో కుటుంబ కధా చిత్రంగా ఈ సినిమా వుంటుంది అని నిర్మాత చెప్పారు. అలాగే ...దాదాపు పాతిక సంవత్సరాల తరువాత వస్తున్న మల్టీస్టారర్ చిత్రమిది. వెంకటేష్, మహేష్‌లు ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈది మాసంస్థకు ప్రతిష్టాత్మక చిత్రమవుతుంది. రెండున్నర్ర సంవత్సరాల క్రితం శ్రీకాంత్ నాకు ఈ కధ చెప్పాడు. ఏడాది క్రితం వెంకటేష్ బాబుకు ఈ కధను చెప్పగానే చేస్తానని అన్నారు.

దూకుడు సినిమా సెట్లో మహేష్‌ను కలసి ఈ చిత్రం గురించి చేబితే కధ వింటానన్నారు. దర్శకుడ్ని పంపించి కధ చేప్పమన్నాను. దర్శకుడు చెప్పిన 15నిమిషాలలోనే నాకు ఫొన్ చేసి ఈ సినిమా చేస్తున్నాను అని అన్నారు. అలా వాళ్ళిద్దరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు వారికి నా ధన్యవాదములు. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభిస్తాము. సమ్మర్‌కు సినిమాను రిలీజ్ చేస్తాము అన్నారు. అలాగే దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు తోలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. రాజమౌళి సినిమా స్క్రిప్టును దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు అందజేశారు. ఇక ఆ మధ్యన గోదావరి ఒడ్డున రాముల వారి సన్నిధిలో భద్రాచలంలోనే చిత్రీకరించేందుకు, లోకేషన్లు పరిశీలించేందుకు శ్రీకాంత్ అడ్డాల భద్రాచలం వెళ్ళి వచ్చారు. సీతారాముల కల్యాణ వేదిక, ఆలయం తదితర పరిసర ప్రాంతాల్లో తీసే సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
Tags: , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.