mahesh babu Businessman Title Song Ready...

ప్రస్తుతం 'దూకుడు' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, 'బిజినెస్ మేన్' సినిమా షూటింగులో పాల్గొంటున్న మహేష్ బాబు హీరోగా ఈ చిత్రానికి పూరీజన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథా పరంగా మాఫియా మరియు లాండ్ స్కామ్ కు సంబందించినది. ఈ చిత్రం చాలా స్టయిలిష్ గా ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ తో చిత్రీకరించబడుతోంది. అలాగే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ట్రాక్ ని రెడీ చేసే పనిలో పడ్డాడట ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్.

దూకుడు చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన తమన్, బిజినెస్ మ్యాన్ కీ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ప్రస్తుతం టైటిల్ ట్రాక్ ని డ్రమ్మర్ శివమణితో కలిసి కంపోజ్ చేసాడట తమన్. ఈ ట్రాక్ కి పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ రచన సమకూర్చగా, రంజిత్ మరియు రాహుల్ నంబియార్ పాడాడని సమాచారం. ఈ ట్రాక్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది.
Tags: , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.