Mahes Babu Tho Samntha Venkatesh Tho Trisha

దిల్‌రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం దసరానాడు అంటే గురువారంనాడు లాంఛనంగా ప్రారంభం కానుంది. మల్టీస్టారర్‌ చిత్రాలు రావడంలేదని ఇండస్ట్రీలో ప్రముఖులు, ప్రజలు గొడవలు చేస్తున్న తరుణంలో ఇటువంటి కథాంశంతో చిత్రం రావడం విశేషమే. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ... ఇటువంటి చిత్రాన్ని నేను ప్రొడ్యూస్‌ చేయడం చాలా ఆనందంగా ఉందని దిల్‌రాజు అన్నారు. కొత్తబంగారులోకం చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం శ్రీనగర్‌కాలనీలోని దిల్‌రాజు కార్యాలయంలో జరగనుంది. ఆ కార్యాలయానికి వెళ్లే రోడ్డు చుట్టుపక్కలా అలంకరిస్తున్నారు.ఈ ప్రారంభోత్సవానికి దాసరి నారాయణరావు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, శ్రీనువైట్లతో పాటు పలువురు సినీప్రముఖులు హాజరుకానున్నారు. శ్రీకాంత్‌ చెప్పిన స్క్రిప్ట్‌ నచ్చి దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌ నుంచి జరగనుంది. మహేష్ బాబు సరసన సమంత నటించనుంది. వెంకటేష్ సరసన త్రిష నటించనున్నట్లు సమాచారం. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.