
రామ్ చరణ్ రీసెంట్ గా మీడియా మిత్రులకు పోన్ చేసి ..తన పూర్తి పేరు కొణిదల రామ్ చరణ్ అని రాయటం కష్టంగా ఉంటే చెర్రి అని రాయండి కాని RCT అని KRCT అని గానీ రాయవద్దని కోరారని వినపడుతోంది. గతంలోనూ రామ్ చరణ్ తన పేరులో తేజ అనేది లేదని, కేవలం రామ్ చరణ్ మాత్రమే అని మీడియాకు స్పష్టంగా చెప్పారు. ఇక అలా తన పేరుని షార్ట్ కట్ లా మారిస్తే బాగోదని,కానీ అదే రాస్తూం ఉంటే ఎన్టీఆర్,ఎఎన్నార్ లాగ అయిపోతుందనే ఆలోచన తోనే ఈ జాగ్ర్తత్త తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం చేస్తున్నారు. అలాగే రచ్చలో గ్యాంగ్ లీడర్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేసి వాడుతున్నారు. ఈ పాట కోసం చిరంజీవి గత చిత్రాల్లో వాడిన డ్రస్ లను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇందుకోసం చిరంజీవి హిట్స్ లోని డ్రస్ లను పరిశీలించి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో అచ్చం చిరంజీవిగా కనిపించి తన తండ్రి అబిమానులను అలరించాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్ చేత స్టెప్స్ వేయించాలని చరణ్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఆమె కాజల్ అయ్యే అవకాశముందని వార్త. మగధీరలో బంగాలనరు కోడి పెట్ట సాంగ్ లో చిరంజీవి కనిపించి అలరించినట్లుగానే ఈ పాట హైలెట్ కావాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ గురించి మాట్లాడుతూ....ఈ చిత్రం టాలీవుడ్ లో ఓ ఉదాహణగా నిలిచిపోతుంది. తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తో ఎంత ఎక్కువ సినిమాటెక్ వ్యాల్యూస్ తో తీయవచ్చు అనే విషయంలో. మేము ఈ సినిమా పూర్తికాగానే ఎంత ఖర్చు అయ్యింది..ఎలా ఖర్చు పెట్టాం అనే విషయాలను తెలియచేస్తాం అన్నారు రామ్ చరణ్.