Chiru disturbed @ Dookudu Report

మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు రికార్డులు చిరంజీవిని చాలా డిస్ట్రబ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రత్యేకంగా రోజూ ఈ కలెక్షన్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి,తన సన్నిహితులనుంచి అడిగితెలుసుకుంటున్నారని తెలుస్తోంది. దానికి కారణం తన కుమారుడు రామ్ చరణ్ మగధీర కలెక్షన్స్ ని అది నిజంగా బ్రేక్ చేస్తోందా లేదా అని తెలుసుకోవటానకి అని చెప్తున్నారు. అంతేగాక రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ కూడా ఇప్పుడు దూకుడు రికార్డులు బ్రద్దలు కొట్టేలా ఉండాలని దర్శకుడు సంపత్ నందికి ఆదేశించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తాను చాలా కాన్పిడెంట్ గా ఉన్నట్లు తన తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది.అందులోనూ దూకుడు చిత్రం అమెరికాలో పేరుపొందిన పత్రికల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ - 'దూకుడు', ద బిగ్గెస్ట్ హిట్ యు హావ్ నెవర్ హార్డ్ ఆఫ్ - అంటూ ఓ వ్యాసాన్నే ప్రచురించడం కూడా చిరుని టెన్సన్ లో పడేసింది.
ఆ పత్రిక ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'మనీబాల్', 'అబ్డక్షన్స్', 'డాల్ఫిన్స్ టేల్స్'కు దీటుగా టాలీవుడ్‌కి చెందిన 'దూకుడు' సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొంది. ఇదివరకు అమెరికాలో ఓ తెలుగు సినిమా మూడు నెలల్లో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు కాగా, ఇప్పుడు 'దూకుడు' చిత్రం కేవలం తొలి మూడు రోజుల్లోనే 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అనూహ్యమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
Tags: , , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.