పోకిరి రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ‘దూకుడు’...!

తెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.7 నుండి 40 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజుకి ముందు పేరున్న చిత్రాలకి రూ.12 నుండి 60 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే రూ.60 నుండి 90 కోట్ల వరకు వ్యాపారం జరగవచ్చు. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మన టాలీవుడ్‌ కు ఈ మధ్యనే 80 సంవత్సరాలు నిండాయి. కలెక్షన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదు అవ్వడం సహజమే. ఎందుకంటే టిక్కెట్టు రేట్లు కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోవడం కూడా కొన్ని చిత్రాలకు కలిసొచ్చే అంశం. ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టే దర్శకులు వేళ్లమీద లెక్కపెట్టుకునేవారే కనిపించడం గమనార్హం.

రీసెంట్‌గా మహేష్‌బాబు నటించిన ‘దూకుడు’ చిత్రం తొలివారం రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది. టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాస్తోన్న ‘దూకుడు’ తాజాగా మరో సరికొత్త రికార్డుని నమోదు చేసింది. పది రోజులకుగాను ‘దూకుడు’ గ్రాస్ 61.9కోట్లకు చేరుకుంది. తొలి రోజు, తొలి వారం రికార్డుల పరంగా చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పటికే టాలీవుడ్ లో వున్న రికార్డుల్ని తుడిచిపెట్టిన ‘దూకుడు’, సరికొత్త రికార్డుల్ని నమోదు చేసిన విషయం విదితమే. దసరా సీజన్ కావడం..ఇంకో సినిమా ఏదీ బరిలో ఇప్పటిదాక లేకపోవడం..అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కామెడీ ఎంటర్ టైనర్ కావడం..వెరసి దూకుడు’ ప్రభంజనానికి అడ్డే లేకుండా పోయింది.
Tags: , , ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.