చిరు తర్వాత నెంబర్ వన్ స్థానం ప్రిన్స్ కేనా...?!

టాలీవుడ్ లో ఇటీవల సరైయిన హిట్ లేని సమయంలో మహేష్ దూకుడు సూపర్ డూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా పండుగ చేసుకుంటున్నారు. పోకిరి తరువాత మహేష్ కు హిట్ లేకున్నా హీరోగా అతని ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని దూకుడు ప్రూవ్ చేసింది. దూకుడు కథలో పెద్దగా దమ్ము లేకున్నా మహేష్ నటనతో పాటు అన్నీ సమ పాళ్ళలో కలవడంతో పాటు సరైన సమయంలో విడుదల కావడం కూడా కలసి వచ్చిందనే చెప్పాలి.
ఏ సినిమాలు లేనందునే దూకుడు 80 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టిందని జూ ఎన్టీఆర్ ఊసరవల్లి విడుదలయితే దూకుడు కొంత తగ్గుతుందని గుసగుసలు అక్కడక్కడ వినిపించాయి. అయితే ఊసరవెల్లి కి యావరేజ్ టాక్ రావడం, దూకుడు పై ఆ సినిమా ప్రభావమేదీ లేదని కలక్షన్లు ఏ మాత్రం తగ్గలేదని దూకుడు ప్ర్రూ చేసుకుంటోంది.

ఊసరవల్లి విడుదలయ్యాక దూకుడు రికార్డులు కూడా బద్దలవుతాయన్నారు. అయినా అలాంటిదేమీ జరగా లేదు. పైగా జూ ఎన్టీఆర్ మళ్ళీ లావయాడని అంటుండగా మహేష్ గ్లామర్ పెరిగింది. ఈ పరిస్థితిలో టాలీవుడ్ లో ప్రస్తుతానికి మహేష్ బాబు నం 1 హీరోగా మారాడు. మళ్ళీ జూ ఎన్టీఆర్ హిట్ కొట్టేవరకు మహేష్ దూకుడు తగ్గదు. దాదాపు 30యేళ్ళు నెంబర్ వన్ స్థానాన్ని ఏలిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి ఆ స్థానాన్ని వదులుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం మహేష్ బాబు లేక ఎన్టీఆర్ కే ఉందని విశ్లేషకులు తేల్చారు. ప్రస్తుతానికి మాత్రం నెంబర్ వన్ స్థానం మహేష్ దే అని సుస్పష్టం చేసేస్తున్నారు. మహేష్ ‘దూకుడు’ రికార్డు స్థాయి వసూళ్ళు సాధించింది. ఈ సినిమాతో పోల్చితే ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ తక్కువ వసూళ్లే సాధించగలిగింది. అంతే కాకుండా పోకిరి కాంబినేషన్ లో బిజినెస్ మ్యాన్ వస్తుండటంతో ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఇక నెంబర్ వన్ స్థానం మహేష్ దే అంటున్నారు. కానీ ఒక్క సినిమాకే ఈ పట్టం కట్టడం కరెక్ట్ కాదు కబాట్టి భవిష్యత్తు సినిమాలు ఎవరు నెంబర్ వన్నో తేల్చుతాయని పరిశీలకులు అంటున్నారు.
Tags: ,

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.